తన తొలి హీరో విజయ్ గురించి ప్రియాంక చోప్రా గతంలో చేసిన వ్యాఖ్యలు వైరల్

  • విజయ్ సినిమాతో సినీ కెరీర్ ను ప్రారంభించిన ప్రియాంక
  • విజయ్ ను చూసేందుకు వందలాది అభిమానులు సెట్స్‌కు వచ్చేవారిని వెల్లడి
  • విజయ్ ను ఫ్యాన్స్ దేవుడిలా ఆరాధిస్తారన్న ప్రియాంక

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, తమిళనాడు నూతన ముఖ్యమంత్రి విజయ్ మధ్య ఉన్న అరుదైన సినీ అనుబంధం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఒకరు హాలీవుడ్ స్థాయికి ఎదిగితే, మరొకరు ఏకంగా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. విజయ్ సినిమా ‘తమిళన్’తోనే ప్రియాంక సినీ ప్రయాణం మొదలయింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో ప్రియాక మాట్లాడుతూ... విజయ్ గురించి చాలా గొప్పగా చెప్పారు.


అప్పట్లో ఆమెకు తమిళం అస్సలు రాకపోయినా, డైలాగులను పేపర్ మీద రాసుకుని బట్టీ పట్టి మరీ చెప్పేవారట. షూటింగ్ అంటే ఎలా ఉంటుందో తెలియని కొత్తలో, విజయ్ ఆమెకు ఎంతో సహకరించారని ప్రియాంక తల్లి మధు చోప్రా కూడా గుర్తుచేసుకున్నారు. ముఖ్యంగా విజయ్ డ్యాన్స్ వేగంతో పోటీ పడటం ప్రియాంకకు మొదట్లో సవాలుగా అనిపించినా, కష్టపడి తన ప్రతిభను చాటుకున్నారట. ఈ సినిమా ఇచ్చిన స్ఫూర్తితోనే ఆమె నటనను కెరీర్‌గా ఎంచుకోవడం గమనార్హం.


షూటింగ్ సమయంలో విజయ్‌కు ఉన్న ఫ్యాన్ బేస్ చూసి ప్రియాంక షాక్ అయ్యారట. సెట్స్‌కు వందలాది మంది అభిమానులు రావడం, విజయ్‌ను దేవుడిలా ఆరాధించడం చూసి ఆయన రేంజ్ ఏంటో అప్పుడే అర్థమైందని ఆమె పేర్కొన్నారు. ఇప్పుడు విజయ్ ముఖ్యమంత్రి కావడంతో, ప్రియాంక నాడు చెప్పిన "దేవుడిలా ఆరాధిస్తారు" అనే మాటలు ఇప్పుడు రాజకీయంగా నిజమయ్యాయని అభిమానులు సంబరపడుతున్నారు.


Vijay
Priyanka Chopra
Tamilan movie
Tamil Nadu Chief Minister
Priyanka Chopra interview
Kollywood
Tamil cinema
Indian politics
celebrity news

More Telugu News